Ap politics - Hot hot politics - telugu
Ap Politics
Hot Hot politics:
ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య రాజకీయ పరాకాష్ట తారాస్థాయికి చేరింది. నిలదీయాల్సిన స్థితి నుండి నిందించే స్థితి వరకు రాజకీయం దిగజారిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో దుర్భాషలాడటం అనేది ఎలా జరుగుతుంది మరియు ఒక సాధారణ వ్యక్తి అభిప్రాయాన్ని కూడా మీరు ఈ క్రింది కి వెళుతూ తెలుసుకోవచ్చు.దుర్భాషలాడటం:
దుర్భాషలాడటం అనే విషయంలో ఏ ఒక్కరు తక్కువ కాదు వైఎస్ఆర్సిపి ఇటువైపు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ అటువైపు ,ఏ ఒక్కరు తక్కువ కాదు అనిపించుకుంటున్నారు. అధికార పక్షం తప్పు చేస్తే నిలదీయవలసిన హక్కు ఉందని, వీళ్లు ఆ విషయాన్ని పక్కన పెట్టి దుర్భాషలాడటం మొదలుపెడతారు. దాన్ని ఖండిస్తూ అధికారపక్షం లో ఉన్న వాళ్ళు తిరిగి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. రోజుకో కొత్త టాపిక్ తీసుకువచ్చి కొత్త తిట్లతో హాట్ హాట్ గా సాగుతుంది రాజకీయం.
ఇంతకీ ఎవరిది తప్పు?:
నిజం చెప్పాలంటే ఎవరిది తప్పు అనే పాయింట్ దగ్గరే ఈ రాజకీయం మొదలవుతుంది. అదే వీళ్ళు ఈ దుర్భాషలాడకుండా ఎవరిది తప్పు అని ఖచ్చితంగా చెప్పగలిగితే సాధారణ జనానికి కూడా ఎవరిది తప్పు అని తెలుస్తుంది. అది తెలిస్తేనే కదా సాధారణ జనం ఓటు అనే ఆయుధంతో వాళ్లకి బుద్ధి చెప్తారు. కానీ ఆ విషయాన్ని పక్కనబెట్టి దుర్భాషలాడుతూ ఎదుటి వారిని కించ పరచడమే ధ్యేయంగా కొంతమంది కొనసాగిస్తున్న రాజకీయాల వల్ల సాధారణ జనం కూడా ఎవరిది తప్పు అని తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇవన్నీ గమనిస్తున్నా సాధారణ జనం ఖచ్చితంగా ఎవరిది తప్పో గుర్తిస్తారు వారికి సరైన సమాధానాన్ని అందిస్తారు.
నా అభిప్రాయం:
నేను నిజాయితీగా నా మనసులో మాట చెబుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు! మీకు మీరు కొట్టుకు చావండి, కానీ మా లాంటి సాధారణ జనం యొక్క కష్టాన్ని! వాళ్ళకున్న బాధలను మర్చిపోకండి. అధికార పక్షంగా మిమ్మల్ని మేము ఎన్నుకున్నము కాబట్టి మీరు మాకు మీ సేవలు అందించండి. అధికారపక్షం సేవ చేయకపోయినా చేసే విధానంలో తప్పులు ఉన్నా మీరు దాన్ని మా పక్షంగా గొంతెత్తి చెప్పమని ప్రతిపక్షాన్ని కోరుతున్న.ఈ విషయాన్ని నేను ఇప్పుడు అంటే 29/10/2021 చెప్తున్నాను.ఇకపై వీళ్ళ రాజకీయం ఎలా సాగుతుందో చూద్దాం.
జై హిద్....
Comments
Post a Comment